ఫ్రిడ్జ్‌లో దుర్వాసన పోవాలంటే... | Go to stink in fridges | Sakshi
Sakshi News home page

ఫ్రిడ్జ్‌లో దుర్వాసన పోవాలంటే...

Dec 25 2015 12:16 AM | Updated on Sep 3 2017 2:31 PM

ఫ్రిడ్జ్‌లో దుర్వాసన పోవాలంటే...

ఫ్రిడ్జ్‌లో దుర్వాసన పోవాలంటే...

కొన్ని కాఫీ గింజలను ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లో ఓ మూలన ఉంచితే దుర్వాసన సమస్య ఉండదు. షవర్‌బాత్ చేసిన తర్వాత షవర్‌ను తుడిచి, ప్లాస్టిక్ కవర్‌ని చుట్టాలి.

ఇంటిప్స్
 
కొన్ని కాఫీ గింజలను ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లో ఓ మూలన ఉంచితే దుర్వాసన సమస్య ఉండదు. షవర్‌బాత్ చేసిన తర్వాత షవర్‌ను తుడిచి, ప్లాస్టిక్ కవర్‌ని చుట్టాలి. ఇలా చేయడం వల్ల షవర్ రంధ్రాల గుండా క్రిములు లోపలికి చేరవు. స్టీల్ తుప్పు పట్టదు.మార్బుల్, టైల్స్ మీద పడిన నెయిల్ పాలిష్ మరకలు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగించాలి.ఉడెన్ ఫర్నీచర్ ఎక్కడైనా దెబ్బతింటే ఆ ప్రాంతంలో వాల్‌నట్ కవర్‌ను అతికించి బాగు చేసుకోవచ్చు.కిచెన్ లేదా బాత్రూమ్ సింక్ కింద కర్టన్‌రాడ్‌ను అమర్చితే టాయ్‌లెట్ క్లీనింగ్ వస్తువులను చక్కగా అమర్చుకోవచ్చు.

వాడేసిన ఇంగువ డబ్బాలో కారం పోసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొద్దిపాటి కాలిన గాయాలకు బాగా మగ్గిన అరటిపండు గుజ్జు రాస్తే ఉపశమనం లబిస్తుంది.బాదం పప్పు పై పొట్టు త్వరగా తొలగించాలంటే 15 నిమిషాలు వేడినీటిలో నానబెట్టాలి. కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి, ఫ్రిజ్‌లో ఉంచాలి. బోరిక్ పౌడర్‌ని కిచెన్ మూలల్లో, కప్‌బోర్డ్ మూలల్లో ఉంచితే బొద్దింకల బెడద తప్పుతుంది.గిన్నెలో కొన్ని ఉల్లిముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి మరిగిస్తే అడుగు భాగంలోని జిడ్డు త్వరగా వదిలిపోతుంది.కొత్తిమీర, పుదీనా ఆకులను ఎండబెట్టి, పొడి చేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుంటే కూరలు, చట్నీల్లోకి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలు వలచి, ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement