చెవులకు కఫ్స్‌

Cuffs for the ears - Sakshi

చెవి బుట్టలు, రింగులు, హ్యాంగింగ్స్‌లో వచ్చిన ఎన్నో డిజైన్లు తెలిసినవే. చెవి మొత్తాన్ని సింగారిస్తూ, చూడగానే ఆకట్టుకునే ఇయర్‌ కఫ్స్‌ నేటితరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  జుంకీలుగా వేలాడుతూ.. చెవి అంచుల వరకు ఉండేవి కొన్ని.  మరికొన్ని దుద్దుల్లా చెవి భాగాన్ని పై వరకు పట్టి ఉంచుతాయి. ఈ కఫ్‌ ఇయర్‌ రింగ్స్‌ చెవినుండి పక్కకి పడిపోకుండా పోగు పైభాగంలో చిన్న కొక్కెం ఉంటుంది. రంధ్రం అక్కర్లేకుండా దాన్ని చెవికి పట్టి ఉంచేలా నొక్కితే సరిపోతుంది. డిజైన్స్‌ విషయానికి వస్తే లతలూ, పువ్వులూ, చేపలూ, జంతువుల బొమ్మలతో పాటు ఎన్నో ఫంకీ డిజైన్లు వీటిలో వస్తున్నాయి. బంగారమే కాదు బ్రాస్, స్టీల్‌.. ఇతర లోహాలతోనూ ఇయర్‌ కఫ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. వీటిని  సందర్భాన్ని బట్టి ధరించవచ్చు. 

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top