లో కేలరీ సోడా కంటే నీళ్లే బెటర్‌!

Better than calorie soda in water - Sakshi

సోడాలు, కూల్‌డ్రింకుల్లో చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి.. కేలరీలు తక్కువగా ఉండేవి తాగుదామని అనుకుంటున్నారా? వాటి కంటే మంచినీళ్లు తాగడం ఎంతో మేలు అంటోంది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌! ఈ లో కేలరీ సోడాలు, కూల్‌డ్రింకులపై ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనలను తాము రెండేళ్ల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, అన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే.. ఈ రకమైన పానీయాల వల్ల బరువు పెరగడం పాటు మతిమరుపు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని.

అయితే అమెరికాలో ఈ లో కేలరీ పానీయాల వాడకం క్రమేపీ తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని.. 2006లో సగటున 5.6 ఔన్సుల వరకూ తాగుతూంటే 2014 కల్లా ఇది 3.8 ఔన్సులకు తగ్గిందని ఇది మంచి పరిణామమేనని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాచెల్‌ కె. జాన్సన్‌ తెలిపారు. ఊబకాయం ఉన్న పిల్లలు, సోడాలు, పానీయాలు నిత్యం తాగేవారు... బరువు నియంత్రించుకునేందుకు లో కేలరీ పానీయాలు కొద్దికాలం పాటు వాడవచ్చు. వాటిని వదిలేయడమే దీర్ఘకాలపు పరిష్కారం. నీళ్లు, కొవ్వులు తక్కువగా ఉండే పాలు తాగడం అన్నిటికంటె ఉత్తమమని సూచిస్తున్నారు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top