బ్యూటిప్స్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Jun 6 2017 11:32 PM | Updated on Sep 5 2017 12:57 PM

బ్యూటిప్స్‌

బ్యూటిప్స్‌

ఎండకు కమిలిన చర్మానికి బొప్పాయి రసం రాస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది.

ఎండకు కమిలిన చర్మానికి బొప్పాయి రసం రాస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. ఫ్రూట్‌ ఫేషియల్‌కు బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును అన్ని రకాల చర్మాల వాళ్లూ వాడవచ్చు. ఒక టేబుల్‌ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్‌ శనగపిండి, టీ స్పూన్‌ పెరుగు కలిపి ప్యాక్‌ వేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి.

మెడ, మోచేతులు, పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాల సేపు రుద్దాలి. ఇలా రెండువారాలు చేస్తే నలుపుపోతుంది.  బొప్పాయిలో సహజసిద్ధంగా మైల్డ్‌ బ్లీచ్‌తోపాటు మాయిశ్చరైజర్‌ కూడా ఉంటుంది. కాబట్టి కృత్రిమ మైన బ్లీచ్, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ రాస్తే కలిగే ఫలితాన్ని బొప్పాయి ప్యాక్‌తో సాధించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement