గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఖాళీలు

Sakshi Employment News, 10,190 Jobs In IBPS Rural Banks

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్లు (క్లరికల్‌), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌–సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 10,190
1.    ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌)– 5249

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
  • వయసు: 18–28 (2018, జూన్‌ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.

2.    ఆఫీసర్‌ స్కేల్‌ –ఐ (అసిస్టెంట్‌ మేనేజర్‌)– 3312

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌ విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు.
  • వయసు: 18– 30 (2018, జూన్‌ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. 

3.    ఆఫీసర్‌ స్కేల్‌– ఐఐ (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు) – 1208.

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్‌ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్‌ రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం. 
  • వయసు: 21– 32 (2018, జూన్‌ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. 

4.    ఆఫీసర్‌ స్కేల్‌–ఐఐ (స్పెషలిస్ట్‌ ఆఫీసర్, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్‌ మేనేజర్, ఐటీ, అగ్రి కల్చర్‌ మేనేజర్‌)– 261.

  • అర్హత: పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/ పీజీ. సంబంధిత రంగంలో ఏడాది/ రెండేళ్ల అనుభవం.
  • వయసు: 21– 32 (2018, జూన్‌ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.

5.    ఆఫీసర్‌ స్కేల్‌– ఐఐఐ (సీనియర్‌ మేనేజర్‌)– 160
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్‌ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్‌ రంగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. ఠి వయసు: 21– 40 (2018, జూన్‌ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి.  
ఎంపిక విధానం: ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. ఆఫీసర్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్షలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫీసర్‌ స్కేల్‌–ఐ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్‌ అనే రెండు అంచెలతో కూడిన రాత పరీక్ష ఉంటుంది. ఆఫీసర్‌ స్కేల్‌–ఐఐ, ఆఫీసర్‌ స్కేల్‌–ఐఐఐ పోస్టులకు ఒకే రాత పరీక్ష (సింగిల్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌) ఉంటుంది. 

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ పద్ధతిలో. 
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100. 
  • దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018.
  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్‌ స్కేల్‌–ఐ– ఆగస్టు 11, 12, 18; ఆఫీస్‌ అసిస్టెంట్లకు ఆగస్టు 19, 25, సెప్టెంబర్‌ 1.
  • ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్‌ పోస్టులకు సెప్టెంబర్‌–30, ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అక్టోబర్‌–7. 
  • ఇంటర్వ్యూలు నవంబర్‌లో ఉంటాయి. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in
www.sakshieducation.com/Banks/Index.html
www.sakshieducation.com/Home.html చూడగలరు

Read latest Employement News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top