విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మంగళవారం ప్రారంభమైంది.
విజయనగరం : విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మంగళవారం ప్రారంభమైంది. 'వైఎస్ఆర్ జనభేరి' యాత్రంలో భాగంగా ఆయన బొబ్బిలి, సాలూరు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం బొబ్బిలి నుండి వైఎస్ జగన్ రోడ్ షో ప్రారంభమైంది.
అక్కడ నుండి గ్రోత్ సెంటర్, మెట్టవలస క్రాస్ రోడ్డు, సీతారాంపురం క్రాస్ రోడ్డు, పారాది మీదగా రామభద్రపురం చేరుకుంటుంది. అక్కడ నుండి తారాపురం, కొట్టక్కి మీదుగా సాలూరు చేరుకోనుంది. సాలూరులో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించనున్నారు.