సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ బి. ప్రసాదరావు తెలిపారు.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ బి. ప్రసాదరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో చెప్పారు. ఎన్నికలప్పుడు మావోలు బహిష్కరణ పిలుపివ్వడం సాధారణమేనని అన్నారు.
మావోయిస్టులు ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. మావోల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో హెలికాప్టర్లను వినియోగిస్తామని వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రసాదరావు హెచ్చరించారు.