సిట్టింగ్‌లకే సీట్లు | Sitting mla's | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌లకే సీట్లు

Apr 6 2014 2:11 AM | Updated on Mar 18 2019 7:55 PM

హస్తినలో హడావుడి అనంతరం... కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది.

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హస్తినలో హడావుడి అనంతరం... కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఊహించిన విధంగానే జిల్లాలోని వుూడు లోక్‌సభ సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకే చోటు కల్పించింది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రత్యర్థి బి.వినోద్‌కువూర్‌పై విజయుం సాధించిన పొన్నం తెలంగాణ ఉద్యవు ఊపులో ఢిల్లీ స్థారుులో అందరి దృష్టిని ఆకర్షించారు.

 

కొత్త రాష్ట్రం ఆవిర్భావ సవుయుంలో వరుసగా రెండోసారి పాత ప్రత్యర్థితోనే తలపడుతున్నారు.  వరుసగా రెండోసారి పెద్దపల్లి(ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేక్‌కు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది. తెలంగాణపై పార్టీ వైఖరిని నిందించి నిరుడు టీఆర్‌ఎస్‌లో చేసిన వివేక్ వారం రోజుల కిందటే సొంత గూటికి చేరుకున్నారు. పాత సీటు నుంచే రెండోసారి పోటీకి సిద్ధపడుతున్నారు. వుధుయూష్కీ వురోసారి నిజావూబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధవువుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement