‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ కాదిది: ఖర్గే | Modi govt has turned 'mother of democracy into muzzled democracy | Sakshi
Sakshi News home page

‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ కాదిది: ఖర్గే

Oct 11 2026 6:37 AM | Updated on Oct 11 2026 6:37 AM

Modi govt has turned 'mother of democracy into muzzled democracy

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం సామాన్యుల గొంతు నొక్కేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశాన్ని ‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’(ప్రజాస్వామ్యానికి తల్లి) నుంచి ‘మజిల్డ్‌ డెమోక్రసీ’(గొంతు నొక్కేసిన ప్రజాస్వామ్యం)గా మార్చేశారని విమర్శించారు. యువత, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రైతు సంఘాల నేతలతో పాటు యూట్యూబర్లు, కంటెంట్‌ క్రియేటర్లు.. ఇలా ఎవరైతే ప్రభుత్వ విధానాలను, లోపాలను ప్రశి్నస్తున్నారో వారందరినీ అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఖర్గే శనివారం ఎక్స్‌లో ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వ తీరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల పిరికితనం నేడు పూర్తిస్థాయిలో బట్టబయలైందని విమర్శించారు. కక్షసాధింపు చర్యలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం నియంతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిర్బంధాలు, అరెస్టులు, జైళ్లు, లాఠీలు, తూటాలతో ప్రజలను భయపెట్టలేరని ఖర్గే స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో యువత ఎప్పుడూ ముందువరసలోనే ఉంటూ వస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతను నిర్బంధాలతో కట్టడి చేయలేరని హెచ్చరించారు. నియంత పాలనపై కాంగ్రెస్, ప్రతిపక్షాలతో కలిసి పోరాటం సాగిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement