మాజీ సీఎంల ముందస్తు అరెస్టుపై నేడు సుప్రీం విచారణ  | Supreme Court to hear plea preventive arrest of former CMs 11 oct 2026 | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంల ముందస్తు అరెస్టుపై నేడు సుప్రీం విచారణ 

Oct 11 2026 5:30 AM | Updated on Oct 11 2026 5:30 AM

Supreme Court to hear plea preventive arrest of former CMs 11 oct 2026

సాక్షి, న్యూఢిల్లీ:  సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చేపట్టిన విపక్ష నేతలతోపాటు నలుగురు మాజీ ముఖ్యమంత్రులను పోలీసులు ముందస్తుగా నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ జరపనుంది. శనివారం నలుగురు మాజీ ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మేనకా గురుస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మెట్రో మూసివేతపై ధిక్కార పిటిషన్‌  
ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్ల మూసివేతపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీనిపై న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement