17న వైఎస్ జగన్ నామినేషన్ | on 17 th april jagan nomination | Sakshi
Sakshi News home page

17న వైఎస్ జగన్ నామినేషన్

Apr 14 2014 4:36 AM | Updated on Oct 17 2018 6:27 PM

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

  పులివెందులలో భారీ ర్యాలీ..
 పూలంగళ్ల వద్ద సభ  భారీగా తరలి రావాలని శ్రేణులకు వైఎస్‌ఆర్ సీపీ నేతల పిలుపు

 
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ముందుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భాకరాపురంలోని స్వగృహం నుంచి కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరుతారు. పూలంగళ్ల వద్ద జనాలనుద్ధేశించి ప్రసంగిస్తారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్‌ను దాఖలు చేస్తారు.

 భారీగా తరలి రండి: వైఎస్‌ఆర్ సీపీ నేతలు
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏడు మండలాల వైఎస్‌ఆర్ సీపీ నాయకులతో నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు సమావేశమై సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ నామినేషన్‌కు సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి.. గ్రామంలోని ప్రతి ఇంటి  నుంచి ప్రజలు వచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు. వైఎస్ జగన్ సీఎం అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో పులివెందుల నుంచి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఊపు మీద ఉందని.. పులివెందులలో కూడా శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని వారు కోరారు.

 తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి, మండలాల కన్వీనర్లు వై.వి.మల్లికార్జునరెడ్డి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, పి.వి.సుబ్బారెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పరిశీలకులు బలరామిరెడ్డి, రామమునిరెడ్డి, వేల్పుల రాము, పులివెందుల, వేముల, వేంపల్లె, సింహాద్రిపురం, తొండూరు మండల నాయకులు రాజుల భాస్కర్‌రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, గిడ్డంగివారిపల్లె రవికుమార్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు గంగిరెడ్డి, సోమశేఖరరెడ్డి, సురేష్‌రెడ్డి, శేషారెడ్డి, శివశంకర్‌రెడ్డి, యూత్ కన్వీనర్లు మనోహర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, ముస్లిం మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ తదితరులు సమీక్షలో  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement