టీడీపీలో చేరిన జేఎస్పీ అసెంబ్లీ అభ్యర్థులు | jai samaikyandhra party mla candidates joins TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరిన జేఎస్పీ అసెంబ్లీ అభ్యర్థులు

May 5 2014 12:38 PM | Updated on Aug 14 2018 4:24 PM

ఎన్నికల సాక్షిగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిల కుమ్మక్కు మరోసారి బయటపడింది.

గుంటూరు: ఎన్నికల సాక్షిగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిల కుమ్మక్కు మరోసారి బయటపడింది. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుండగా వీరి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు బట్టబయలయ్యాయి. మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థులు పచ్చ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ ఓట్లు టీడీపీకి వేయిస్తామంటూ జేఎస్పీ అభ్యర్థులు ప్రకటించడం గమనార్హం. దీంతో తెరచాటుగా కుమ్మక్కు రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి.

చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తోంది. కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా విప్ జారీ చేసి కాపాడారని వైఎస్సార్ సీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు జరిగిన పలు ఎన్నికల్లో బాబు-కిరణ్ కుమ్మక్కు రాజకీయాలు చేశారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement