పవన్కు గడ్డమోపదేశం! | cpi narayana suggestion to pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్కు గడ్డమోపదేశం!

Mar 23 2014 9:50 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్కు గడ్డమోపదేశం! - Sakshi

పవన్కు గడ్డమోపదేశం!

నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉండే కామ్రేడ్ కె నారాయణ ఈసారి ఓ గొప్ప వాస్తవం వెల్లడించారు.

నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉండే కామ్రేడ్ కె నారాయణ ఈసారి ఓ గొప్ప వాస్తవం వెల్లడించారు. గడ్డం థియరీతో కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. జనసేన పేరుతో ఫోర్స్గా పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు గడ్డమోపదేశం చేశారు. గడ్డంను చూసి మోసపోవద్దని, గడ్డాలన్ని ఒకటి కాదని చెప్పారు. నారాయణ గడ్డం థియరీ ప్రవచించడానికి కారణం మోడీతో పవన్ భేటీ.

పవర్స్టార్ పాలిటిక్స్ తనకు అర్థం కావడం లేదంటూ బుర్ర గోక్కున్నారు కామ్రేడ్ నారాయణ. పవన్‌కల్యాణ్ రాజకీయాలేమిటో, ఆయన చెప్పిన విషయాలేమిటో.. తనకేమీ అర్థం కాలేదని ఈ  సీపీఐ నాయకుడు వ్యాఖ్యానించారు. పవన్ మోడీని కలవడం, ఆయన ద్వారా ప్రచారం సాగించాలనుకోవడం సరికాదన్నారు. ‘‘చేగువేరాను ఎక్కువగా ఆరాధించే పవన్ ఒకటి తెలుసుకోవాలి. మోడీ గడ్డం, చేగువేరా గడ్డం ఒక్కటి కాదు! చేగువేరా గడ్డం సమాజాన్ని మార్చేది.. మోడీ గడ్డం సమాజాన్ని ధ్వంసం చేసేది’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు బూర్జువా పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని నారాయణ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement