ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఏ ప్రశ్నలు..? | Which questions will get from Reason part in RBI Assistant exam? | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఏ ప్రశ్నలు..?

Jul 29 2014 3:06 AM | Updated on Sep 2 2017 11:01 AM

బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్‌కు అధిక ప్రాముఖ్యం ఉంది. అభ్యర్థి ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగు తారు. గ్రూప్ ప్రశ్నలను రీజనింగ్ నుంచి ఎక్కువగా ఇస్తారు.

కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
 - ఏల్చూరి ప్రవళిక, ఉప్పుగూడ
బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్‌కు అధిక ప్రాముఖ్యం ఉంది. అభ్యర్థి ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగు తారు. గ్రూప్ ప్రశ్నలను రీజనింగ్ నుంచి ఎక్కువగా ఇస్తారు. ఇందులో ముఖ్యంగా సీటింగ్ అరేంజ్‌మెంట్, లాజికల్ స్టేట్ మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ ఈక్వాలిటీస్, డేటా సఫీషియన్సీ, ఎనలిటికల్ రీజనింగ్, ఆల్ఫాబెట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
 
 వీటికి సమాధానం గుర్తించాలంటే అభ్యర్థి కచ్చితమైన కన్‌క్లూజన్లు, పాసిబిలిటీల మధ్య వ్యత్యాసాలను గమనించాలి. సమాధానంలో ఏ మాత్రం తేడా అనిపించినా అది పాసిబిలిటీగాను, కచ్చిత మైన సమాధానం వస్తే అది కన్‌క్లూజన్‌గానూ పరిగణించాలి. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. వీటిపై రెండు నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఆపరేషన్స్‌కు సంబంధించిన ప్రశ్నలను అభ్యర్థులు సాధన చేయాలి. సీటింగ్ అరేంజ్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల నిర్వహించిన బ్యాంక్ పరీక్షలలో 10 నుంచి 15 మార్కులకు ప్రశ్నలు అడిగారు.
 
 సీటింగ్ అరేంజ్‌మెంట్ ప్రశ్నల్లో.. వ్యక్తులందరూ ఒకే వైపు ముఖం ఉండేవిధంగా కూర్చొని ఉన్నవి; కొంతమంది వెలుపలి వైపు, మరికొంతమంది లోపలి వైపు కూర్చొని ఉండే ప్రశ్నలు ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. వీటిని జాగ్రత్తగా చేయాలి. వీటిని సాధించడంలో చిన్న పొరపాటు చేసినా, దానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తప్పుగా గుర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ఇన్‌ఈక్వాలిటీస్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు రావచ్చు. నంబర్ సిరీస్ నుంచి గతంతో పోలిస్తే మరింత క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగం నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. నాన్ వెర్బల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగడం లేదు. అయితే వీటిపై కొంతైనా అవగాహన ఉండటం ప్రయోజనకరం.
 - ఇన్‌పుట్స్: ఇ.సంతోష్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement