నెరవేరిన మహానేత వైఎస్‌ హామీలు | ysr prommised works starting | Sakshi
Sakshi News home page

నెరవేరిన మహానేత వైఎస్‌ హామీలు

Jul 27 2016 8:18 PM | Updated on Jul 7 2018 3:19 PM

నెరవేరిన మహానేత వైఎస్‌ హామీలు - Sakshi

నెరవేరిన మహానేత వైఎస్‌ హామీలు

అమరావతి : సుమారు ఎనిమిదేళ్ల కిందట నరుకుళ్లపాడు మేళ్లవాగులో ప్రమాదం జరిగి 23 మంది చనిపోయిన సందర్భంలో బాధితులను పరామర్శించిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

 అమరావతి : సుమారు ఎనిమిదేళ్ల కిందట నరుకుళ్లపాడు మేళ్లవాగులో ప్రమాదం జరిగి 23 మంది చనిపోయిన సందర్భంలో బాధితులను పరామర్శించిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే నరుకుళ్లపాడు మేళ్లవాగుపై హెలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎండ్రాయి, పెదమద్దూరు, లాం వద్ద వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గత సంవత్సరం సుమారు 5కోట్ల రూపాయలతో నరుకుళ్లపాడు మేళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణ æపనులను ప్రారంభించారు. ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. ఎండ్రాయి వద్ద కొండవీటి వాగుపై సుమారు 9 కోట్ల రూపాయలతో హెలైవల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. ప్రస్తుతం బ్రిడ్జిలకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, పుష్కరాలకు(వచ్చేనెల 9వ తేదీ నాటికి) బ్రిడ్జిలను పూర్తిచేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.   వైఎస్‌ హామీలు నెరవేరడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement