కొత్తమాజేరులో చెరువును పరిశీలించిన వైఎస్ జగన్ | ys jagan mohan reddy visits kottamajeru pond in krishna district | Sakshi
Sakshi News home page

కొత్తమాజేరులో చెరువును పరిశీలించిన వైఎస్ జగన్

Aug 4 2015 2:29 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు చేరుకున్నారు.

కొత్తమాజేరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలుషితంగా మారిన మంచినీటి చెరువును పరిశీలించారు. కాగా విష  జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు.  గ్రామస్తులు కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడినా సకాలంలో స్పందించని అధికారుల తీరుపైనా వివరాలను ఆయన  అడిగి తెలుసుకుంటారు. అంతకు ముందు వైఎస్ జగన్...శ్రీకాకుళం గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement