పోతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy Rythu Bharosa Yatra third day in Anantapur District | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

Jan 8 2016 6:21 PM | Updated on Jul 25 2018 4:09 PM

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.

అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం పోతిరెడ్డి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అని వేళలో అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పోతిరెడ్డి కుటుంబానికి భరోసా ఇచ్చారు.

అటు చూస్తే వేసిన పంట ఎండిపోయింది... ఇటు చూస్తే చేసిన అప్పులు తీర్చే దారి కానరాక రైతు బసిరెడ్డిగారి పోతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ నేపథ్యంలో రైతు బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఈరోజు పరామర్శించారు. కాగా వైఎస్ జగన్ అనంతపురంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. గురువారం అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ అయిదు రైతు కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement