వైరా..పోరు | wyra poru | Sakshi
Sakshi News home page

వైరా..పోరు

Sep 20 2016 11:15 PM | Updated on Sep 4 2017 2:16 PM

మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులు

మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులు

నియోజకవర్గ కేంద్రమైన వైరాను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, పెట్రోల్‌ బంక్‌లు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు పలికాయి.

  • ‘రెవెన్యూ డివిజన్‌’ కోసం బంద్‌ సంపూర్ణం
  •  
     
    వైరా: నియోజకవర్గ కేంద్రమైన వైరాను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, పెట్రోల్‌ బంక్‌లు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు పలికాయి.  నాయకులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వైరాను రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు. ఇది సాకారమయ్యేందుకు పోరాడుతామని ప్రకటించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రాములు నాయక్‌, చింతినిప్పు మురళీధర్‌రావు, పసుపులేటి మోహన్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు, యమాల గోపాలరావు, వంశీ, వనమా విశ్వేశ్వరావు, శీలం వెంకటనర్సిరెడ్డి, మచ్చా వెంకటేశ్వరరావు, చెరుకూరి కిరణ్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ నేపథ్యంలో ఘర్షణలు తలెత్తకుండా డీఎస్పీ ఎం శ్రీధర్‌రెడ్డి, సీఐ వి.చేరాలు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement