బ్యాంకర్ల ఒత్తిడి తాళలేక.. | with bankers pressure | Sakshi
Sakshi News home page

బ్యాంకర్ల ఒత్తిడి తాళలేక..

Oct 31 2016 11:47 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పు కట్టమని బ్యాంకర్లు ఒత్తిడి చేయడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కోసిగి మండలం పల్లెపాడులో చోటుకుంది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
 
ఆదోని టౌన్‌:  అప్పు కట్టమని బ్యాంకర్లు ఒత్తిడి చేయడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కోసిగి మండలం పల్లెపాడులో చోటుకుంది. గ్రామానికి చెందిన రైతు హనుమంతుకు రెండు ఎకరాల బోరు పొలం ఉంది. అక్కడ మిరప పంటను సాగు చేశాడు. వర్షాధారం కింద మరో నాలుగు ఎకరాలను కౌలుకు సాగు చేశాడు. అరకొరగా కురిసిన వర్షాలతో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ క్రమంలో పంట సాగు కోసం బ్యాంక్‌లో తెచ్చుకున్న రుణం వెంటనే చెల్లించాలని రెండు సార్లు నోటీస్‌లు ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. 2014–15లో బ్యాంకులో రూ. 40వేలు అప్పు తీసుకోగా వడ్డీతో కలుపుకొని రూ. 70 వేలు అయింది. రుణమాఫీ కింద పదివేలు మాఫీ అయిందని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబీకులు ఆదోనికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోసిగి పోలీసులు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement