
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో మనస్తాపానికి గురైన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది.
భాగ్యనగర్ కాలనీ: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో మనస్తాపానికి గురైన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అశోక్, లావణ్య (23)లకు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంత కాలం నుంచి అశోక్ మరో మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవటంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి షిప్టులో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన అశోక్ తన భార్య లావణ్య ఉరివేసుకోవటం చూసి పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.