భర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఆత్మహత్య | Wife Committed suicide | Sakshi
Sakshi News home page

భర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఆత్మహత్య

Jun 18 2016 1:43 AM | Updated on Aug 17 2018 7:48 PM

భర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఆత్మహత్య - Sakshi

భర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఆత్మహత్య

భర్త మద్యానికి బానిసయ్యాడని, దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని భావించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

వీపనగండ్ల : భర్త మద్యానికి బానిసయ్యాడని, దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని భావించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వీపనగండ్ల మండలంలోని అమ్మాయిపల్లికి చెందిన మం గమ్మ (55), రాచూరి బీరయ్య దంపతులు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గు రు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, కొన్ని నెలలుగా భర్త పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని భార్య మనోవేదను గురైంది.

దీంతో ఆమె గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మృతి చెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సాయిచంద్రప్రసాద్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement