బహిరంగ చర్చకు మేం సిద్ధమే.. | We are ready to open discussion | Sakshi
Sakshi News home page

బహిరంగ చర్చకు మేం సిద్ధమే..

Sep 2 2016 10:02 PM | Updated on Sep 4 2017 12:01 PM

బహిరంగ చర్చకు మేం సిద్ధమే..

బహిరంగ చర్చకు మేం సిద్ధమే..

మద్నూర్‌ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని, దీనిపై మండల జేఏసీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సంగమేశ్వర్‌

మద్నూర్‌ : మద్నూర్‌ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని, దీనిపై మండల జేఏసీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సంగమేశ్వర్‌ సవాల్‌ విసిరారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లాలో మద్నూర్‌ మండలాన్ని కొనసాగిస్తే మండల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా నష్టం తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై జేఏసీ నాయకులు ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కామారెడ్డి జిల్లాలో మద్నూర్‌ను కలిపితే కలిగే ఉపయోగాల గురించి తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాయిలు, మొయిన్‌ పటేల్, దరాస్‌ సురేష్, బాబు పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement