వరంగల్‌ మండలం ఫైళ్ల విభజన | warangal mandal files division | Sakshi
Sakshi News home page

వరంగల్‌ మండలం ఫైళ్ల విభజన

Sep 19 2016 12:19 AM | Updated on Apr 4 2019 2:50 PM

వరంగల్‌ మండలం ఫైళ్ల విభజన - Sakshi

వరంగల్‌ మండలం ఫైళ్ల విభజన

వరంగల్‌ మండలాన్ని విభజిస్తున్నందున తహసీల్దార్‌ కార్యాలయంలో ఫైళ్ల విభజన ఆదివారం ప్రారంభమైంది. వరంగల్ మండలంలో 3లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండగా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో నూతనంగా ఖిలావరంగల్‌ మండల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పోచమ్మమైదాన్‌ : వరంగల్‌ మండలాన్ని విభజిస్తున్నందున తహసీల్దార్‌ కార్యాలయంలో ఫైళ్ల విభజన ఆదివారం ప్రారంభమైంది. వరంగల్ మండలంలో 3లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండగా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో నూతనంగా ఖిలావరంగల్‌ మండల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని యాకుబ్‌పురాలోని ఎస్టీ హాస్టల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వరంగల్‌ మండలానికి మట్టెవాడ, రామన్నపేట, లక్ష్మీపురం, దేశాయిపేట గ్రామాలు, ఖిలావరంగల్‌ మండలానికి ఖిలావరంగల్‌, రంగశాయిపేట, ఉర్సు గ్రామాలతో ఏర్పాటు చేయనున్నారు. అయితే తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల పహాణీలు, ఆర్‌సీలు, ఇతర ఫైళ్లు విభజన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement