breaking news
warangal mandal
-
వరంగల్ మండలం ఫైళ్ల విభజన
పోచమ్మమైదాన్ : వరంగల్ మండలాన్ని విభజిస్తున్నందున తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్ల విభజన ఆదివారం ప్రారంభమైంది. వరంగల్ మండలంలో 3లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండగా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో నూతనంగా ఖిలావరంగల్ మండల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖిలావరంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని యాకుబ్పురాలోని ఎస్టీ హాస్టల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వరంగల్ మండలానికి మట్టెవాడ, రామన్నపేట, లక్ష్మీపురం, దేశాయిపేట గ్రామాలు, ఖిలావరంగల్ మండలానికి ఖిలావరంగల్, రంగశాయిపేట, ఉర్సు గ్రామాలతో ఏర్పాటు చేయనున్నారు. అయితే తహసీల్దార్ కార్యాలయంలో భూముల పహాణీలు, ఆర్సీలు, ఇతర ఫైళ్లు విభజన చేస్తున్నారు. -
మూడు ఇన్.. మూడు ఔట్
ఇదీ వరంగల్ మండల పరిస్థితి.. పోచమ్మమైదాన్ : జిల్లాలోనే ఎక్కువ జనాభా కలిగిన మండలంగా పేరొందిన వరంగల్ మండ లం కొత్త మండలాల ఏర్పాటుతో రెండుగా చీలిపోనుంది. వరంగల్, హన్మకొండ పరిధిలోని పలు గ్రామాలను కలుపుకోని ఖిలావరంగల్, వరంగల్ మండలాలుగా వేరు చేస్తున్నారు. ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతాలను ఖిలావరంగల్, వరంగల్ మండలాలకు కలిపుతున్నారు. 1997లో హన్మకొండ నుంచి వరంగల్ మండలంను వేరు చేశారు. ప్రస్తుతం ఈ మండలంలోని 2011 సంవత్సరంలో 3లక్షలకు పైగా వరంగల్ మండలం జనాబా పెరిగింది. అర్బన్ పరిధిలో 1.5లక్షలకే ఒక మండలం ఉండాల్సి ఉంది. ప్రస్తుత వరంగల్ మండలంలోని ఎనిమిది గ్రామాలు ఉండగా మూ డు గ్రామాలు ఖిలా వరంగల్, ఉర్సు, రంగశాయిపేట విడిపోయి.. హన్మకొండ మండలం నుంచి తిమ్మాపూర్, అల్లీపూర్, నక్కలపల్లి కలిసి ఖిలా వరంగల్ మండలంగా ఏర్పడుతాయి. ఇక వరంగల్లో గిర్మాజీపేట, రామన్నపేట. మట్టెవాడ, దేశాయిపేట, లక్ష్మీపురం మిగలనుండగా హన్మకొండ నుంచి మళ్లీ ఏనుమాముల, కొత్తపేట, పైడిపల్లి వచ్చి కలుస్తాయి. తద్వారా మళ్లీ ఎనిమిది మండలాల్లో వరంగల్ కొత్త రూపు సంతరించుకోనుండగా 1.6లక్షల జనాభా ఉంటుంది. ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో కార్యాలయం ఖమ్మం రోడ్డులోని ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో నూతనంగా ఏర్పాటయ్యే ఖిలావరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి అద్దె భవనం కోసం వేటలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఖిలావరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సొంత భవనం నిర్మించనున్నారు.