దేశాభివ​ృద్ధికి గ్రామమే ఆధారం | village is base for nation development | Sakshi
Sakshi News home page

దేశాభివ​ృద్ధికి గ్రామమే ఆధారం

May 7 2017 12:27 AM | Updated on Aug 20 2018 5:23 PM

దేశం అభివృద్ధి బాటలో పయణించాలంటే ముందుగా పల్లెలు అభివ​ృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు.

– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
కల్లూరు (రూరల్‌): దేశం అభివృద్ధి బాటలో పయణించాలంటే ముందుగా పల్లెలు అభివ​ృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. శనివారం ఎస్పీ తన దత్తత గ్రామం కప్పట్రాళ్లను సందర్శించారు. అనంతరం  గ్రామంలో పొదుపు సంఘాలు సాధించిన జీవనోపాధులు, గ్రామ జ్యోతి ద్వారా కుట్టుమిషన్, కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలు, వర్మీ కంపోస్టు, జిల్లా పరిషత్‌ పాఠశాల, స్త్రీ శక్తి భవన్‌  నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత నగరంలోని సస్యా ప్రైడ్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి వచ్చిన బృందంతో సమావేశమయ్యారు. ఈ బ​ృంద్రం కప్పట్రాళ్ల గ్రామాభివ​ృద్ధి గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.  కప్పట్రాళ్ల ను ఆదర్శంగా తీసుకుని  అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామాలను అభివృద్ధి చేస్తామని వారు చెప్పారు.  కార్యక్రమంలో ఓర్వకల్లు పొదుపు సంఘం అధ్యక్షురాలు విజయభారతి, కర్నూలు డీఎస్పీ డీవీ రమణమూర్తి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement