పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్ | Vijayawada honour killing case, najma lover deepak arrest | Sakshi
Sakshi News home page

పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్

Jul 9 2016 1:04 AM | Updated on Sep 4 2017 4:25 AM

బీబీజానీ, నజ్మా

బీబీజానీ, నజ్మా

నజ్మా పరువు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె ప్రియుడు దీపక్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

మృతురాలి ప్రియుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
 
 సాక్షి, విజయవాడ : విజయవాడలో జరిగిన పరు వు హత్య కేసులో మృతురాలు నజ్మా ప్రియుడు దీపక్‌ను, హత్య చేసిన తల్లి బీబీజానీని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేశారు. తన కుమార్తెను లైంగికంగా ఇబ్బందిపెట్టాడని, ఇద్దరూ తీయిం చుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికాకుండా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడని నజ్మా తండ్రి మైసూర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. దీపక్ కాల్‌డేటాను పరిశీలించి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన నజ్మా తల్లి బీబీజానీని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ సహేరా బేగం నిర్వహించిన విచారణలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. నజ్మా కుటుంబం మూడునెలలుగా వాంబే కాలనీలో ఉంటోంది. ఎంబీయే చదివి భార్య నుంచి విడాకులు తీసుకున్న దీపక్ అదే కాలనీలో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దీపక్ రెండు నెలలుగా నజ్మాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు.  ఈ వ్యవహారంపై మందలించినా నజ్మా వినకపోవడంతో తల్లి బీబీజాని ఆమెను చంపేసింది.

 మైనర్ కావటంతోనే పోక్సో చట్టం
 17ఏళ్ల బాలిక నజ్మాను ప్రేమపేరుతో వేధించాడని, పరోక్షంగా ఆమె మరణానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్ట్ -2012 (పోక్సో చట్టం), కిడ్నాప్ తదితర కేసులను పోలీసులు దీపక్‌పై నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం ప్రకారం.. బాలిక ఇష్టపూర్వకంగా ప్రియుడితో బయటకు వెళ్లినా అతడిదే నేరం అవుతుంది. బాలికల్ని ప్రేమించటం నేరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement