లాభాల బాటలో అర్బన్‌బ్యాంకు | urban bank in profit | Sakshi
Sakshi News home page

లాభాల బాటలో అర్బన్‌బ్యాంకు

Sep 25 2016 10:17 PM | Updated on Sep 4 2017 2:58 PM

కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు లాభాల బాటలో ఉందని ఆ బ్యాంకు చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌ తెలిపారు. నగరంలోని కృషిభవన్‌లో ఆదివారం బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు లాభాల బాటలో ఉందని ఆ బ్యాంకు చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌ తెలిపారు. నగరంలోని కృషిభవన్‌లో ఆదివారం బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.254 కోట్ల లావాదేవీలు నిర్వహించగా రూ.1.06లక్షలు లాభం ఆర్జించినట్లు తెలిపారు. నికర లాభం రూ.61,99,989 కోట్లు వచ్చిందని దీనికి గాను రూ.44 లక్షల ఆదాయపు పన్ను చెల్లించినట్లు వివరించారు. గతేడాది రూ.83 లక్షల లాభం ఆర్జించగా నికరలాభం రూ.54,84,625 వచ్చినట్లు తెలిపారు. ఇందుకుగాను రూ.28 లక్షల ఆదాయపు పన్ను చెల్లించినట్లు చెప్పారు. బ్యాంకు సీఈవో జి.చంద్రమౌళితో పాటు సభ్యులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement