తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం ఊబలంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఎదురెదురుగు వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఊబలంక సమీపంలో గురువారం వెలుగుచూసింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో వినయ్‌కాంత్ రెడ్డి(22) అనే ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు వెంకట సాయిబాబా రెడ్డి(28) మృతిచెందగా.. సాయిబాబా కూతురితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.