క్రీడల అభివృద్ధికి కృషి | try to sports devolopment | Sakshi
Sakshi News home page

క్రీడల అభివృద్ధికి కృషి

Apr 30 2016 4:58 AM | Updated on Mar 28 2018 11:26 AM

క్రీడల అభివృద్ధికి కృషి - Sakshi

క్రీడల అభివృద్ధికి కృషి

క్రీడల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.

మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మిస్తాం
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
మహేశ్వరంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం

మహేశ్వరం: క్రీడల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రావీణ్యమున్న గ్రామీణ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్  ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలిస్తుందన్నారు. మహేశ్వరం మండలంలో  కబడ్డీ, క్రికెట్, ఖోఖోలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఉన్నారని తెలిపారు.

మహేశ్వరంలో మినీస్డేడియం నిర్మిస్తామని చెప్పారు. ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానానికి వెళ్లేలా సహకరిస్తామని మంత్రి మహేం దర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు గడికోటలో జ్యోతి వెలిగించి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ రామకృష్ణ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, తహసీల్దార్ షర్మిల, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, మహేశ్వరం సర్పం చ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, టీఆర్‌ఎస్ నాయకులు కూన యాదయ్య, బోద జైపాల్‌రెడ్డి, తడకల యాదయ్య, అశోక్, పీఈటీలు రాాజ్‌కుమార్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement