జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 24న మలివిడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ సురేందర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, కాటారం, రామగుండం, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఆయా ప్రభుత్వ ఐటీఐలలో ఉన్న ఖాళీలను ఈ కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
రేపు ఐటీఐలలో రెండో విడత కౌన్సెలింగ్
Aug 22 2016 11:35 PM | Updated on Sep 4 2017 10:24 AM
పెద్దపల్లిరూరల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 24న మలివిడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ సురేందర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, కాటారం, రామగుండం, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఆయా ప్రభుత్వ ఐటీఐలలో ఉన్న ఖాళీలను ఈ కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
27నుంచి ప్రైవేట్ ఐటీఐల్లో...
జిల్లాలోని ప్రైవేట్ ఐటీఐల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 27 నుంచి రెండోవిడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు ఆయా ఐటీఐల్లో జరిగే కౌన్సిలింగ్‌కు నేరుగా హాజరుకావాలన్నారు. ఈనెల 27న మార్కోస్ (కరీంనగర్), కాకతీయ(పెద్దపల్లి), సాదువెంకటరెడ్డి (ఎల్లారెడ్డిపేట), శివశక్తి (గోదావరిఖని) ఐటీఐలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 28న సాయి (జగిత్యాల), శ్రీసార«థి (ఎన్‌టీపీసీ), వివేకవర్ధిని (సిరిసిల్ల), ఆల్బర్ట్ (పెద్దపల్లి), గార్గిల్ (హుజూరాబాద్), సింధూర (పెద్దపల్లి), 29న గౌతమి (గోదావరిఖని), జీఎస్సార్ (జమ్మికుంట), వాసవి (హుజూరాబాద్), సిఎస్‌ఐ (కరీంనగర్), శివసాయి (పెద్దపల్లి), 30న సూర్య (కరీంనగర్), శ్రీరామ (హుజూరాబాద్), లక్ష్మి (మెట్‌పల్లి), తేజస్వి (హుస్నాబాద్), సంతోష్ (కరీంనగర్) ఐటీఐలలో జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్, జిరాక్సు సర్టిఫికెట్లతో సకాలంలో హాజరుకావాలని కన్వీనర్ సురేందర్ కోరారు.
Advertisement
Advertisement