ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ‘డివినిటీ సిఫ్‌’ | ITI MF launches Diviniti SIF | Sakshi
Sakshi News home page

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ‘డివినిటీ సిఫ్‌’

Jun 16 2025 2:47 AM | Updated on Jun 16 2025 8:10 AM

ITI MF launches Diviniti SIF

హైదరాబాద్‌: ఐటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ ‘డివినిటీ సిఫ్‌’ పేరుతో స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ వ్యాప్తంగా వినూత్నమైన పెట్టుబడి పరిష్కారాలను డివినిటీ సిఫ్‌ అందిస్తుందని ఐటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్, పీఎంఎస్‌/ఏఐఎఫ్‌ల మధ్య వారధిగా ఇది ఉంటుందని ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఈవో జతిందర్‌ పాల్‌ సింగ్‌ పేర్కొన్నారు.

మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనగుణంగా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కాలను అందిస్తుందన్నారు. అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ఇటీవలే ప్రత్యేక పెట్టుబడుల విభాగం ‘సిఫ్‌’ను అనుమతించడం తెలిసిందే. ఇందులో కనీసం రూ.10 లక్షల నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement