359 మండలాల్లో కరువు: మంత్రి యనమల | there are 359 drought zones In AP: minister yanamala | Sakshi
Sakshi News home page

359 మండలాల్లో కరువు: మంత్రి యనమల

Apr 26 2016 6:07 PM | Updated on May 25 2018 1:22 PM

రాష్ట్రంలో 359 మండలాలను... కరువు మండలాలుగా ప్రకటించామని అంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెల కొన్నాయని.. ఈ కారణంగా రాష్ట్రంలో 359 మండలాలను...  కరువు మండలాలుగా ప్రకటించామని అంద్ర ప్రదేశ్  రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వల్లూరులో మంగళవారం ఇంకుడుగుంత శంకుస్థాపనకు వచ్చిన ఆయన గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. మే నెలలో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయన్నారు.

 

గత పదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. స్వయం సహాయక సంఘాలను ఆదుకునేందుకు మొదటి విడతలో రూ.మూడు వేల కోట్లు అందించామని, ఇప్పుడు మరో రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. అన్ని గ్రామాలనూ స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement