కమలాపురం రైల్వే గేటు సమీపంలోని తూర్పు వైపునకు ఉన్న 283/2–3 కిలోమీటరు రాయి మధ్య ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కమలాపురం: కమలాపురం రైల్వే గేటు సమీపంలోని తూర్పు వైపునకు ఉన్న 283/2–3 కిలోమీటరు రాయి మధ్య ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాదక్ వలి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం వెంకటాపురం వీవర్స్ కాలనీకి చెందిన దండే నరసింహులు (50) సోమవారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. ఆయన కుడి భాగంతోపాటు తల వెనుక భాగం బాగా దెబ్బతింది. ముఖం ఒక వైపు బాగుండటంతో దుగ్గాయపల్లె వాసులు నరసింహులుగా గుర్తించారు. ఆయన కొన్నేళ్లుగా సీకే దిన్నె మండలంలోని ఊటుకూరు సమీపంలోని వడ్డీలకాలనీలో సూరి హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగించే వాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. నరసింహులుకు భార్య నాగలక్షుమ్మ, కుమార్తె ఉన్నారు.