ప్రకాశం జిల్లా రాచర్లలో పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి మృతి చెందాడు
రాచర్ల(ప్రకాశం): పోలీసుల దాష్టికానికి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని కాలువపల్లికి చెందిన రామాంజనేయులును ఓ కేసు నిమిత్తం శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. రాత్రంతా చిత్రహింసలు చేయడంతో రామాంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసులే కొట్టి చంపి అనంతరం ఆస్పత్రికి తరలించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా.. గుండెపోటుకు గురై మృతిచెందాడని వాదిస్తున్నారు.