కడప నగర శివార్లలోని ఇర్కాన్ జంక్షన్‌లో గురువారం సాయంత్రం సిమెంట్ ట్యాంకర్, ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కడప నగరం గంజికుంట కాలనీకి చెందిన ఆరీఫుల్లా అనే వ్యక్తి మృతి చెందాడు.
కడప అర్బన్:
కడప నగర శివార్లలోని ఇర్కాన్ జంక్షన్‌లో గురువారం సాయంత్రం సిమెంట్ ట్యాంకర్, ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కడప నగరం గంజికుంట కాలనీకి చెందిన ఆరీఫుల్లా అనే వ్యక్తి మృతి చెందాడు. ఆటో డ్రైవర్ ఓబన్న, మరో ప్రయాణికుడు ఆలీ తీవ్రంగా గాయపడ్డారు.చెన్నూరు వైపు నుంచి ఆటో జంక్షన్‌లోకి రాగానే, రాజంపేట రోడ్డు వైపు నుంచి ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొంది. సంఘటనా స్థలాన్ని ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.