నీటి రుసుము వసూళ్లలో నిర్లక్ష్యం
													 
										
					
					
					
																							
											
						 మునిసిపాలిటీలకు ఆస్తి పన్ను, నీటి రుసుము ప్రధాన ఆదాయ వనరులు.   అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి చార్జీ కోట్ల రూపాయల్లో నిలిచిపోయింది.
						 
										
					
					
																
	–రూ.30.92 కోట్లకుగాను  వసూలు చేసింది రూ.13.05 కోట్లే 
	–పెద్ద నోట్ల రద్దును సద్వినియోగం చేసుకోని వైనం
	–  బకాయి: రూ.17.87 కోట్లు 
	 
	అనంతపురం అర్బన్ : మునిసిపాలిటీలకు ఆస్తి పన్ను, నీటి రుసుము ప్రధాన ఆదాయ వనరులు.   అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి చార్జీ కోట్ల రూపాయల్లో నిలిచిపోయింది.  నీటి చార్జీ వసూలుకు రద్దయిన పాత నోట్లను తీసుకోవచ్చునని ప్రభుత్వం ఆదేశిస్తూ అందుకు కొంత గడువు  కూడా ఇచ్చింది.  మునిసిపల్ అధికారులు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 
	 
	వసూలు డిమాండ్ రూ.30.92 కోట్లు 
	అనంతపురం కార్పొరేష¯ŒSతో పాటు, జిల్లాలోని 11 మునిసిపాలిటీల పరిధిలో 1,17,280 నీటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి పాత బకాయితో కలుపుకుని ప్రస్తుత ఏడాది వసూలు చేయాల్సిన  నీటి చార్జీ రూ.30.92 కోట్లు ఉంది. ఇందులో రూ.13.05 కోట్లను (42.13శాతం) మాత్రమే మునిసిపాలిటీలు వసూలు చేశాయి. ప్రస్తుతం రావాల్సిన బకాయి రూ.17.87 కోట్లు .