రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట గొల్లపల్లిలో గుర్తుతెలియని మహిళ మృత దేహం బావిలో లభ్యమైంది.
రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట గొల్లపల్లిలో గుర్తుతెలియని మహిళ మృత దేహం బావిలో లభ్యమైంది. మంగళవారం అటుగా వెళ్లిన స్థానికులు మహిళ మృత దేహం బావిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మృతురాలి వివరాలు తెలియ రాలేదు.