తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి ఓ పెళ్లి బస్సు బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి ఓ పెళ్లి బస్సు బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
తుని నుంచి కాకినాడ బయలుదేరిన పెళ్లి బృందం బస్సు పిఠాపురంలోని పెందుర్తి జంక్షన్ వద్దకు చేరుకోగానే బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తాపడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా లక్ష్మీ(45) అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనలో నాలుగేళ్ళ చిన్నారి చైతన్య సురక్షితంగా బయటపడ్డాడు.