తెలుగమ్మాయిలే హీరోయిన్లు కావాలి: బ్రహ్మానందం | telugu girls become heroines: brahmanandam | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయిలే హీరోయిన్లు కావాలి: బ్రహ్మానందం

Feb 15 2016 10:37 AM | Updated on Sep 3 2017 5:42 PM

తెలుగమ్మాయిలే హీరోయిన్లు కావాలి: బ్రహ్మానందం

తెలుగమ్మాయిలే హీరోయిన్లు కావాలి: బ్రహ్మానందం

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లే ఉండాలని హాస్యనటుడు బ్రహ్మానందం ఆశాభావం వ్యక్తంచేశారు.

విజయవాడ (మొగల్రాజపురం): తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లే ఉండాలని హాస్యనటుడు బ్రహ్మానందం ఆశాభావం వ్యక్తంచేశారు. ఫ్యాషన్ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. మరో హాస్యనటుడు ఆలీ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానిలోని యువత ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు.

సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎండీ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత జాతీయస్థాయిలో రాణించేలా తయారుచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. హాస్యనటులు చలాకీ చంటి, గాలిపటాల సుధాకర్, భాస్కర్ చేసిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. గాయకులు దీపు, పరిణిక, దినకర్ తమ గానామృతంతో ఆకట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement