టీఆర్ఎస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: కొండా రాఘవరెడ్డి | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: కొండా రాఘవరెడ్డి

Published Fri, Dec 2 2016 3:16 AM

టీఆర్ఎస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: కొండా రాఘవరెడ్డి - Sakshi

సాక్షి, ఖమ్మం: ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఆ మేని ఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు.. ఆ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. ప్రజలకు ఏం చేశారో ఈ రెండున్నరేళ్ల పాలనపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

గురు వారం ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ మేనిఫెస్టో భగవద్గీతతో సమానమని పోల్చిన కేసీఆర్.. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా..? అని ప్రశ్నించారు. 35 శాఖలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన వం దకుపైగా హామీల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు.

Advertisement
Advertisement