breaking news
Konda Raghava Reddy
-
వనదేవతల ఆశీస్సులతో జగన్ సీఎం కావాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం కావాలని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తు(72 కిలోలు) బంగారాన్ని మొక్కుగా చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని తల్లులను వేడుకున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో జాతర అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేసి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వైఎస్ సీఎం హోదాలో జరిగిన రెండు జాతరలకు హాజరయ్యారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతరకు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డికి వనదేవతలపై ఎంతో నమ్మకం ఉందన్నారు. 2019లో ఏపీ సీఎం అయితే దర్శనం కోసం సమ్మక్క సన్నిధికి తీసుకుస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి నాడెం శాంతకుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ తదితరులున్నారు. -
టీఆర్ఎస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: కొండా రాఘవరెడ్డి
సాక్షి, ఖమ్మం: ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఆ మేని ఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు.. ఆ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. ప్రజలకు ఏం చేశారో ఈ రెండున్నరేళ్ల పాలనపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గురు వారం ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ మేనిఫెస్టో భగవద్గీతతో సమానమని పోల్చిన కేసీఆర్.. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా..? అని ప్రశ్నించారు. 35 శాఖలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన వం దకుపైగా హామీల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు.