తెలంగాణ మట్కా డాన్ అరెస్ట్ | Telangana matka Dan arrested | Sakshi
Sakshi News home page

తెలంగాణ మట్కా డాన్ అరెస్ట్

Jun 9 2016 3:53 AM | Updated on Oct 16 2018 2:30 PM

తెలంగాణ మట్కా డాన్ అరెస్ట్ - Sakshi

తెలంగాణ మట్కా డాన్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్రం అలంపూర్ నియోజకవర్గం అయిజకు చెందిన మట్కా డాన్ జంగం రాచయ్యను బుధవారం....

ఆదోని రూరల్: తెలంగాణ రాష్ట్రం అలంపూర్ నియోజకవర్గం అయిజకు చెందిన మట్కా డాన్ జంగం రాచయ్యను బుధవారం పెద్దతుంబళం పోలీసులు అరెస్ట్ చేశారు. రాచయ్య కొంతకాలంగా ఆదోని మండలంలోని  కొందరు బీటర్ల సహాయంతో మట్కా నిర్వహిస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఈయన కింద బీటర్లుగా పనిచేస్తున్న ఆరుగురిని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు.

ప్రత్యేక బృందం రెక్కి నిర్వహించి బుధవారం కోసిగి క్రాస్ రోడ్డు వద్ద రాచయ్యను పట్టుకొని రూ. 75,900 నగదు, మట్కా చీటీలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్స్ ఖాజా, ఆచారిని సన్మానిస్తూ ఎస్‌ఐ నగదు రివార్డు అందజేశారు. గతంలో వీరు ఆరుగురు మట్కా బీటర్లను పట్టుకున్న కేసులో కూడా రివార్డును అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement