రుద్రంగి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ రద్దు | teacher suspanes vecheint | Sakshi
Sakshi News home page

రుద్రంగి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ రద్దు

Sep 14 2016 10:46 PM | Updated on Sep 4 2017 1:29 PM

జిల్లా ఉపాధ్యాయ సంఘాలు, రుద్రంగి గ్రామస్తుల ఆందోళనతో జిల్లా విద్యాధికారి దిగొచ్చారు. రుద్రంగిని ప్రత్యేక మండలం చేయాలని కోరిన ఉపాధ్యాయుడు అంబటి శంకర్‌ సస్పెన్షన్‌ ఎత్తేశారు. విధుల్లో చేరాలని ఉత్తర్వులు అందించారు. దీంతో రుద్రంగి గ్రామస్తులు ఉపాధ్యాయడు శంకర్‌ను పూలమాలలతో సన్మానించారు.

చందుర్తి :  జిల్లా ఉపాధ్యాయ సంఘాలు, రుద్రంగి గ్రామస్తుల ఆందోళనతో జిల్లా విద్యాధికారి దిగొచ్చారు. రుద్రంగిని ప్రత్యేక మండలం చేయాలని కోరిన ఉపాధ్యాయుడు అంబటి శంకర్‌ సస్పెన్షన్‌ ఎత్తేశారు. విధుల్లో చేరాలని  ఉత్తర్వులు అందించారు. దీంతో రుద్రంగి గ్రామస్తులు ఉపాధ్యాయడు శంకర్‌ను పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ ఎత్తివేత  ప్రజా విజయమన్నారు. కార్యక్రమంలో సనుగుల సింగిల్‌ విండో అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, మాల మహానాడు మండల అధ్యక్షుడు బత్తుల కమలాకర్, మండల సాధన కమిటీ సభ్యుడు ఎర్రం నర్సయ్య, తర్రె లింగం, ఒద్యారపు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 
ఉపాధ్యాయ సంఘాల హర్షం
శంకర్‌ సస్పెన్షన్‌ ఎత్తివేతతో టీజేఏసీ మండల కన్వీనర్‌ వికృర్తి లక్ష్మీనారాయణ ,పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ఎడ్ల కిషన్, డీటీ ఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి  వంగ తిరుపతి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కట్కూరి ముఖేశ్‌ తదితరులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement