టీడీపీ రాక్షస పాలన సాగిస్తోంది | tdp govt not good | Sakshi
Sakshi News home page

టీడీపీ రాక్షస పాలన సాగిస్తోంది

Nov 16 2016 10:18 PM | Updated on Aug 18 2018 9:03 PM

టీడీపీ రాక్షస పాలన సాగిస్తోంది - Sakshi

టీడీపీ రాక్షస పాలన సాగిస్తోంది

రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలన సాగిస్తోందని ఏపీసీసీ కాపు రిజర్వేషన్‌ సాధికారిత విభాగం సభ్యులు పి.సూరిబాబు, నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు

విజయవాడ సెంట్రల్‌ : రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలన సాగిస్తోందని ఏపీసీసీ కాపు రిజర్వేషన్‌ సాధికారిత విభాగం సభ్యులు పి.సూరిబాబు, నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు గృహ నిర్బంధం చేయడం టీడీపీ అరాచకత్వానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎవరి అనుమతితో చంద్రబాబు పాదయాత్ర సాగించారని, టీడీపీ నాయకులు చేస్తున్న జనచైతన్య యాత్రలకు లేని అనుమతి ముద్రగడ యాత్రకు ఎందుకు? అని నిలదీశారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముద్రగడ అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. కాపుల్లో చీలిక తెచ్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందుకే కపట ప్రేమ నటిస్తున్నారని దుయ్యబట్టారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి వెయ్యికోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన బాబు గడిచిన 28 నెలల్లో ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. ముద్రగడ దీక్షల వెనుక వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమనారు. అరెస్ట్‌లతో కాపు ఉద్యమాన్ని నిలువలేరని వారు స్పష్టం చేశారు. ఏపీసీసీ కాపు రిజర్వేషన్‌ సాధికారిత కమిటీ నాయకులు ఆకుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement