‘సువెన్‌’ సేవలు అభినందనీయం | suven services Admirable | Sakshi
Sakshi News home page

‘సువెన్‌’ సేవలు అభినందనీయం

Aug 3 2016 11:32 PM | Updated on Sep 4 2017 7:40 AM

‘సువెన్‌’ సేవలు అభినందనీయం

‘సువెన్‌’ సేవలు అభినందనీయం

సూర్యాపేటరూరల్‌ : సమాజ అభివృద్ధికి సువెన్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు.

సూర్యాపేటరూరల్‌ : సమాజ అభివృద్ధికి సువెన్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీలో ఏర్పాటు చేసిన శాంతినగర్, కేసారం, దురాజ్‌పల్లి, ఖాసీంపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బెంచీలు, నోట్‌బుక్స్‌ షూ, సాక్స్, టై, బెల్ట్స్‌ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనూ కంపెనీ భాగస్వామ్యం కావాలని, మొక్కలను నాటడమే కాకుండా..వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువెన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రెండు లక్షల విలువైన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తహసీల్దార్‌ మహమూద్‌అలీ, ఎంఈఓ గ్లోరి, సర్పంచ్‌ బాలిని పద్మ, లింగస్వామి, ఎంపీటీసీ సూర సంధ్య, వెంకన్న, సువెన్‌ యూనిట్‌ హెడ్‌ వి.ఎస్‌ఎన్‌ మూర్తి, డీజీఎం బి.లక్ష్మణమూర్తి, ఏజీఎంలు సి.హెచ్‌ వీరయ్య, ఎం.కృష్ణారావు, పి.జగపతిరాయుడు, చంద్రహాస, రసూల్‌మదీన, ఎం.వెంకటరమణ, మేనేజర్లు డి.సుధాకర్, డి.వి శేషగిరిరావు, పి.వెంకటరమణ, పీఆర్‌ఓ బూర రాములుగౌడ్, పాఠశాలల హెచ్‌ఎంలు సురేష్, కట్కూరి రవీందర్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, నీరజ, మంగతాయారు పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement