ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ... | Sujana chowdary takes on congress party | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ...

Aug 14 2015 7:03 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ... - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ...

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి స్పందించారు.

విజయవాడ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. శుక్రవారం విజయవాడ వచ్చిన సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... ఉభయ సభలలో కాంగ్రెస్ తీరు దారుణంగా ఉందని ఆ పార్టీపై నిప్పులు చెరిగారు.

20 రోజులపాటు పార్లమెంట్ జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ నడిచి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వంటి అంశాలు పరిష్కారమయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్రయోజనం వచ్చేలా ప్రయత్నం చేస్తానని సుజనా చౌదరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement