సమ్మెను జయప్రదం చేద్దాం | Success will strike | Sakshi
Sakshi News home page

సమ్మెను జయప్రదం చేద్దాం

Aug 24 2016 7:54 PM | Updated on Sep 4 2017 10:43 AM

సమ్మెను జయప్రదం చేద్దాం

సమ్మెను జయప్రదం చేద్దాం

సెప్టెంబరు 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని యూనియన్‌ నాయకులు అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

కడప కల్చరల్‌:
సెప్టెంబరు 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని యూనియన్‌ నాయకులు అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆలిండియా ఇన్సూ్యరెన్స్‌ ఎంప్లాయిస్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఐసీఈయూ కడప డివిజన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయ ఆవరణంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 11 కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయని, ఉద్యోగులందరం కలిసి సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఎఫ్‌డీఐ పెంపును ఉపసంహరించాలని, ధరల పెరుగుదల అరికట్టాలని, అర్హులందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని,నాలుగు ప్రభుత్వ జనరల్‌ ఇన్సూ్యరెన్స్‌ కంపెనీలను కలపాలని, ఎల్‌ఐసీలో మూడు, నాల్గవ తరగతి ఉద్యోగుల నియామకాలను చేపట్టాలన్నది ముఖ్యమైన డిమాండ్లుగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఉన్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో నిర్వీర్యం చేస్తుండడంతో కార్మికులు బాగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరిస్తూ వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దేశంలో ముఖ్యమైన రంగాలైన ఇన్సూ్యరెన్స్, రైల్వే, విమాన, రక్షణ రంగాలలో ఎఫ్‌డీఐ పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలు, సామ్రాజ్యవాద దేశాల అడుగులకు మడుగులొత్తుతూ దేశభద్రత, సార్వభౌమాధికారం లాంటి విషయాలలో రాజీ పడడం క్షేమకరమన్నారు. ఈ ప్రదర్శనలో యూనియన్‌ డివిజన్‌ నాయకులు కిరణ్‌కుమార్, మద్దిలేటి, శ్రీవాణి, డీఓ యూనిట్‌ నాయకులు కేసీఎస్‌ రాజు, అవధానం శ్రీనివాస్, శ్రీకృష్ణ, శ్రీనివాసకుమార్, పక్కీరయ్య,జేవీ రమణ అయ్యవారురెడ్డి, టి.నరసయ్య, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement