breaking news
lic employees
-
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఎల్ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఎల్ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) -
సమ్మెను జయప్రదం చేద్దాం
కడప కల్చరల్: సెప్టెంబరు 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని యూనియన్ నాయకులు అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆలిండియా ఇన్సూ్యరెన్స్ ఎంప్లాయిస్ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఐసీఈయూ కడప డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయ ఆవరణంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 11 కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయని, ఉద్యోగులందరం కలిసి సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఎఫ్‌డీఐ పెంపును ఉపసంహరించాలని, ధరల పెరుగుదల అరికట్టాలని, అర్హులందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని,నాలుగు ప్రభుత్వ జనరల్ ఇన్సూ్యరెన్స్ కంపెనీలను కలపాలని, ఎల్ఐసీలో మూడు, నాల్గవ తరగతి ఉద్యోగుల నియామకాలను చేపట్టాలన్నది ముఖ్యమైన డిమాండ్లుగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉన్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో నిర్వీర్యం చేస్తుండడంతో కార్మికులు బాగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరిస్తూ వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దేశంలో ముఖ్యమైన రంగాలైన ఇన్సూ్యరెన్స్, రైల్వే, విమాన, రక్షణ రంగాలలో ఎఫ్‌డీఐ పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలు, సామ్రాజ్యవాద దేశాల అడుగులకు మడుగులొత్తుతూ దేశభద్రత, సార్వభౌమాధికారం లాంటి విషయాలలో రాజీ పడడం క్షేమకరమన్నారు. ఈ ప్రదర్శనలో యూనియన్ డివిజన్ నాయకులు కిరణ్‌కుమార్, మద్దిలేటి, శ్రీవాణి, డీఓ యూనిట్ నాయకులు కేసీఎస్ రాజు, అవధానం శ్రీనివాస్, శ్రీకృష్ణ, శ్రీనివాసకుమార్, పక్కీరయ్య,జేవీ రమణ అయ్యవారురెడ్డి, టి.నరసయ్య, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.