ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం | Start checking certificates ICET | Sakshi
Sakshi News home page

ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

Aug 27 2016 12:10 AM | Updated on Jul 25 2019 5:24 PM

ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం - Sakshi

ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

ఐసెట్‌లో అర్హత సాధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

పోచమ్మమైదాన్‌ / కేయూ క్యాంపస్‌  : ఐసెట్‌లో అర్హత సాధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉదయం 1 నుంచి 3వేల వరకు, మధ్యాహ్నం 6001 నుంచి 9వేల వరకు, హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో ఉదయం 3001 నుంచి 6 వేల వరకు, మధ్యాహ్నం 9001 నుంచి 12వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించారు. పరిశీలన అనంతరం విద్యార్థులకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఇన్‌చార్జి శంకర్, కోఆర్డినేటర్‌ అభినవ్, సత్యనారాయణ, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్ట్స్‌ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మధుకర్, ఏటీబీటీ ప్రసాద్, ఎస్‌ఎం రహమాన్, ఎస్‌.సుధీర్, డాక్టర్‌ నహిత, శ్రీలత, అన్వర్‌పాషా, సుధాకర్, అశోక్, శైలజ, రవీందర్‌రెడ్డి, కళాశాల అసిస్టెం ట్‌ రిజిస్ట్రార్‌ రాజయ్య పాల్గొన్నారు.
 
నేటి ర్యాంకుల పరిశీలన
శనివారం ఉదయం వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12,001 నుంచి 15వేల వరకు, మధ్యాహ్నం 18,001 నుంచి 21 వేల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో ఉదయం 15,001 నుంచి 18 వేల వరకు, మధ్యాహ్నం 21,001 నుంచి 24 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement