శ్రీశైలం డ్యాం నీటిమట్టం 859.60 అడుగులు | srisailam dam water level is 859.60fts | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాం నీటిమట్టం 859.60 అడుగులు

Jan 10 2017 12:14 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం డ్యాం నీటిమట్టం సోమవారం 859.60 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యాం నీటిమట్టం సోమవారం 859.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 104.6466 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఆదివారం నుంచి సోమవారం వరకు 0.553 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1.807 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 4,446 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుత్‌ డిమాండ్‌ను అనుసరించి రెండు పవర్‌హౌస్‌లలో ఉత్పత్తి చేస్తుండగా, సోమవారం సాయంత్రం 6 గంటలకు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు జనరేటర్లు ఒక్కొక్కటి 106.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement